Header Ads

రెవిన్యూ దరఖాస్తులకు వేలిముద్ర విధానము

భూ సమస్యలకు వచ్చే దరఖాస్తులను అనుమతించే విషయములో మండల రెవిన్యూ అధికారులు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియ మొదలు అయింది రెవిన్యూ శాఖ నుంచి వెలువడిన ఆదేశముల మేరకు మండలాల్లో చర్యలు తీసుకున్నారు ధ్రువీకరణ పత్రాలు అడంగల్ లో మార్పులు చేర్పులు సవరణలకు అనుమతి తెలుపడములో mro లది కీలక పాత్ర ఈ డిజిటల్ సిగ్నచర్ విధాన్నాన్ని కార్యాలయములో పని చేసే సిబ్బంది దుర్వినియోగం చేస్తున్నారు వీరిపై అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమములో ముఖ్యముగా భూ వివాదాలకు సంబంధించి మండల రెవిన్యూ అధికారులకు బయో మెట్రిక్ విధానాన్ని తప్పని సరి చేసారు దీని వలన mro లకు తెలియకుండా అనుమతి పత్రాలు జారీ ఇక పై ఉండదు ఈ విధానము వలన సమస్యలు తగ్గుతాయి అని రెవిన్యూ సంఘం నాయకులు తెలిపారు


No comments