Header Ads

How to Apply || NTR Bharosa Pension || Online

ఎన్.టి ఆర్ భరోసా పెన్షన్ 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉన్న పేద మధ్యతరగతి వారికీ మరియు వృద్దులు ,వికలాంగులు ,వంటరి మహిళలకు ,వితంతువులకు,చర్మకారులకు ,డప్పు కళాకారులకు ,ట్రాన్స్ జండర్ లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ లను పంపిణి చేస్తుంది 
  • 1000 /- రూ గా ఉన్న పెన్షన్ ను 2000 /- రూ పెంచడం జరిగింది అదేవిధముగా రెండు చేతులు లేనివారికి 10000/-రూ డప్పు కళాకారులకు 3000/- రూ ప్రతి నెల 1 వ తారీఖున అందించడం జరుగుతుంది 
  • దాదాపు గా సుమారు 53 లక్షల మంది కి ఈ సామజిక పించెన్ లను ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది 
  • రాష్ట్రములో ఉన్న నిరుపేద వృద్దులకు ఇది ఎంత గానో ఉపయోగ పడుతుంది 

ఎన్ టిఆర్ భరోసా పెన్షన్ అప్లై చేయు విధానము 

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన విధముగా వయస్సు ,తెల్ల రేషన్ కార్డు ,మరియు ఆధార్ కార్డు ఉండాలి 
  • అర్హతలు కలిగిన వారు జన్మ భూమి - మావూరు సభల ద్వారా అర్జీ నమోదు చేయాలి ,నమోదు చేసిన అర్జీలను అధికారులు పరిశీలిస్తారు ,పరిశీలించిన అర్జీల జాబితాను జన్మ భూమి కమిటీల పర్యవేక్షణ చేసి తుదుపరి లిస్ట్ ను కమిటీ తయారు చేసి అధికారులకు పంపడం జరుగుతుంది ,ఒక నెల వ్యవధి లో ప్రభుత్వం పెన్షన్ లను మంజూరు చేస్తుంది 
  • మండల కేంద్రాలలో ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమములో కూడా అర్జీ నమోదు చేసుకొనవచ్చును 
  • మీసేవ కేంద్రాల ద్వారా కూడా అర్జీ నమోదు చేసుకొనవచ్చును 
మరిన్ని వివరాలకు :https://ntrbharosa.ap.gov.in/



No comments