Header Ads

CHANDHRANNA BHIMA APPLY ONLINE

చంద్రన్న భీమా పధకం గురించి 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తముగా ఉన్న రోజువారీ కూలీలు మరియు అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్దేశించిన పధకం చంద్రన్న భీమా 
  • అసంఘటిత రంగములో ఉన్న కార్మికులు భీమా చేయడం లో నిర్లక్ష్యము ,మరియు పేద రికము అడ్డంకిగా ఉన్నదీ ఇటువంటి అసమానతలను తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న భీమా పధకాన్ని ప్రవేశ పెట్టింది ఇది కేంద్ర ప్రభుత్వములోని ప్రధాన మంత్రి భీమా పధకముతో అనుసంధానం అయి  ఉంటుంది 
  • ఈ పధకం రాష్ట్రములోని నిరుపేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఉపయోగ పడుతుంది అనడములో ఎటువంటి సందేహము అవసరము లేదు 
  • ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబాన్ని ఈ పధకంలో చేర్చడం జరిగింది వారి తరుపున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందు 
  • చంద్రన్న భీమా పధకములో స్కాలర్ షిప్ సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది 
  • రాష్ట్ర ప్రభుత్వములో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ పధకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తుంది 
  • ఈ పధకంలో చేరుటకు ప్రభుత్వము వారు నిర్వహించు ప్రజా సాధికారిక సర్వే నందు తప్పని సరిగా నమోదు కావాలి మరియు తెల్ల రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి 
  • చంద్రన్న భీమా పధకంలో చేరుటకు ఎటువంటి రుసుము చెల్లించ వలసిన అవసరం లేదు నామ మాత్రపు రుసుము ఉన్నప్పటి కి ప్రభత్వం చెల్లిస్తుంది 

నమోదు చేసుకునే విధానము 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి మీ మండల కేంద్రములో తహశీల్ధార్ కార్యాలయములో సంప్రదించగలరు ప్రజా సాధికారికా సర్వే బృందము మీ వివరాలను నమోదు చేస్తారు 
  • లేదా 1100 కాల్ సెంటర్ కి ఫోన్ చేయడము ద్వారా మీ వివరాలు చెప్పి ఈ పధకంలో జాయిన్ అవ్వ వచ్చు 
  • లేదా ప్రతి సోమవారం జరుగు మీకోసం కార్యక్రమము నందు మీ పేరు నమోదు చేసుకోవచ్చు 
మరిన్ని వివరాలకు :http://chandrannabima.ap.gov.in/Default.aspx





























1 comment: