Header Ads

బోప్పాయి సాగు భలే బాగు

బోప్పాయి సాగు భలే బాగు 

  • వర్ష భావ పరిస్థితులలో సతమతం అవుతూ సంప్రదాయ పంటలను సాగు చేయలేని రైతులు పండ్ల తోటలపై ఆసక్తి చూపిస్తున్నారు పరిమిత నీటి తో ఆధునిక పద్దతులను అవలంభిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు పంట మార్పిడి విధానములో భాగముగా ఉద్యాన వాన పంటలపై ద్రుష్టి సారిస్తున్నారు ,ధర ఆశ జనకముగా ఉండడంతో అన్నదాతలు బొప్పాయి సాగుకు మొగ్గు చూపారు మండల లోని చింతలపాడు కు చెందిన రైతులు అనంతపురం జిల్లా నుంచి తైవాన్ రెడీ మేడ్ మొక్కలను సాగు చేసి అధిక దిగుబడులు రావడం తో లాభాలు సాధించారు గత జూన్ లో ఎకరానికి 1000 మొక్కల చొప్పున కొనుగోలు చేసి నాటారు ట్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కల కు నీటిని అందించారు పైరు వేసిన నాలుగు నెలలకి కోతలు ప్రారంభించారు ఎకరానికి 50 నుంచి 60 టన్నుల దిగుబడులు వస్తున్నాయి అని ఆశిస్తున్నారు కేజీకి 17 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు ఎకరానికి సుమారు లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెప్తున్నారు అధిక ఉష్ణో గ్రతలకు మొక్కల ఆకులు ఎర్రబడడం కొంచం ఆందోళన కలిగించే అంశము ప్రకృతి కూడా సహకరిస్తే బొప్పాయి సాగు కాసుల వర్షం కురిపిస్తుంది అని భావిస్తున్నారు 
  • చిన్న , సన్న కారు రైతులకు బొప్పాయి సాగు లాభాలు తెచ్చి పెడుతుంది అని నిర్వాహకులు చెపుతున్నారు 

No comments